News & Views

చర్చ, భద్రాచలం: భద్రాచలం పట్టణంలో కల్తీ నెయ్యి తయారీ తనిఖీలు చేసి పట్టుకున్న భద్రాచలం పోలీస్ శాఖ అధికారులు

భద్రాచలం పట్టణంలో కల్తీ నెయ్యి తయారీ తనిఖీలు చేసి పట్టుకున్న పోలీస్ శాఖ

  1. భద్రాచలం పట్టణంలో కల్తీ నెయ్యి తయారీ
  2. తనిఖీలు చేసి పట్టుకున్న భద్రాచలం పోలీస్ శాఖ అధికారులు

భద్రాచలంలోని మెయిన్ రోడ్ నందు ఉన్న శ్రీ రామ లాడ్జ్ నందు కొంత మంది వ్యక్తులు కల్తి నెయ్యి తయారు చేసి అమ్ముతున్నారన్న నమ్మదగిన సమాచారం రాగా, గురువారం మధ్యాహ్నం సమయంలో పై అధికారుల ఆదేశాల మేరకు భద్రాచలం ఎస్ ఐ వి సతీష్ , వారి సిబ్బంది మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫుడ్ సెప్టి అధికారి తో కలిసి శ్రీ రామ లాడ్జ్ నందు తనిఖి చేయగా కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నలుగురు వ్యక్తులు మల్లిఖార్జున, కే శ్రీనివాస్, షిఖరేశ్వర, కే మల్లిఖార్జున కల్తి నెయ్యి తయారు చేయుచుండగా పట్టుకొని, కల్తి నెయ్యి తయారు చేయడానికి ఉపయోగించే పరికరాలను, వస్తువులను మరియు కల్తి నెయ్యి తయారు చేసి డబ్బాలలో ప్యాక్ చేసిన సుమారు 65 కేజీల కల్తి నెయ్యితో పాటుగా సదరు నలుగురు ముద్దాయిలను పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్లి కేసు నమోదు చేయడం జరిగింది. స్వాదిన పర్చుకున్న కల్తి నెయ్యి విలువ సుమారు 52,000 రూపాయల వరకు ఉంటుందని పోలీసులు ప్రెస్ నోట్ లో తెలిపారు.