News & Views

చర్చ,పెద్దపల్లి: బయో మెడికల్ బయట వేస్తే చర్యలు తప్పవు – మున్సిపల్ కమిషనర్ జె. అరుణ శ్రీ

బయో మెడికల్ బయట వేస్తే చర్యలు తప్పవు

 

చర్చ,పెద్దపల్లి:

బయో మెడికల్ బయట వేస్తే చర్యలు తప్పవు – మున్సిపల్ కమిషనర్ జె. అరుణ శ్రీ

రామగుండం మున్సిపల్ పరిధిలో బయో–మెడికల్ వ్యర్థాల సక్రమ నిర్వహణపై శుక్రవారం అదనపు కలెక్టర్ ,మున్సిపల్ కమిషనర్ జె. అరుణ శ్రీ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు,ల్యాబ్ లు , స్కానింగ్ సెంటర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ వ్యర్థాలతో పాటు బయోమెడికల్ వ్యర్థాలను బయటవేస్తే ఆసుపత్రుల పైన కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు.మున్సిపల్ సిబ్బంది సేకరించే వాటిలో బయోమెడికల్ వ్యర్థాలు పారేడం వలన కార్మికులు ఇన్ఫెక్షన్లతో,అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని అన్నారు.బయోమెడికల్ పర్యావరణ కాలుష్యం, ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తుందని పేర్కొన్నారు.

హాస్పిటల్ యాజమాన్యం బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీలతో తప్పనిసరిగా టై-అప్ చేసుకోవాలని, మున్సిపల్‌కు ఇస్తున్న వ్యర్థాలలో బయోమెడికల్ వ్యర్థాలు కనిపిస్తే బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ చట్టం–2016, మున్సిపల్ చట్టం, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్–2010 ప్రకారం జరిమానాలు మరియు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లా వైద్యాదికారి డాక్టర్ వి వాణిశ్రీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి NOC తప్పనిసరిగా కలిగి ఉండాలని, అలాగే గుర్తింపు పొందిన బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీతో టై-అప్ పొందాలని ఆదేశించారు.

ప్రభుత్వం జారీ చేసిన గైడ్‌లైన్స్ ప్రకారం బయోమెడికల్ వేస్ట్‌ను స్టొర్స్ వద్దనే (OT, వార్డు, లేబర్ రూమ్, ఇంజెక్షన్ రూమ్, ల్యాబ్‌లు)
కలర్ కోడ్ బిన్స్‌లో వేరు చేయాలని తెలిపారు.
ఏజెన్సీ వాహనం రాకపోయినా, టై-అప్ రిన్యువల్ చేసుకోక పోయినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సమాచారం అందిస్తే, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఆరోగ్య శాఖ కు తెలియ జేస్తె క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్-2010 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రుల యాజమాన్యాలు, డాక్టర్లు మరియు ఐ.ఎం.ఎ. సభ్యులు సహకారించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపాలిటీ సీనియర్ అదనపు & డిప్యూటీ కమిషనర్లు, డా. కృపాబాయి (ఆర్.ఎం.ఓ., ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, రామగుండం), బయోమెడికల్ వేస్ట్ ఏజెన్సీ ప్రతినిధి సతీశ్, ఐ.ఎం.ఎ. అధ్యక్షులు క్యాస శ్రీనివాస్, డాక్టర్లు లక్ష్మీవాణి, డా. వనజ రాపోలు, డా దామెర అనిల్ కుమార్, ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.