News & Views

చర్చ ములుగు జిల్లా : నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన సామాజిక వైద్యశాల ఔట్సోర్సింగ్ వైద్య బృందం

మూడు నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్న ఉద్యోగులు

నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన సామాజిక వైద్యశాల ఔట్సోర్సింగ్ వైద్య బృందం

_మూడు నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్న ఉద్యోగులు.

చర్చ ములుగు జిల్లా
(ఏటూరు నాగారం)

ఎన్ హెచ్ ఎం లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ స్కీం లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మూడు నెలల నుంచి జీతాలు లేక నానా ఇబ్బందుల గురవలసిన పరిస్థితి కనపడుతుంది ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు సమర్పించిన హెల్త్ కమిషనర్ గారికి వినతి పత్రాలు ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఈనెల 20 న హైదరాబాద్ హెల్త్ కమిషనర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాకు భారీ ఎత్తున ఉద్యోగులు ధర్నా నిర్వహించారు అదే క్రమంలో
ఈరోజు ఏటూరు నాగారం సామాజిక వైద్యశాలలో ఎన్ హెచ్ ఎం స్కీం కింద పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు మూడు నుంచి ఐదు నెలల నుంచి జీతాలు రాక రోడ్డున పడవలసిన పరిస్థితి కనపడుతుంది కావున ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి సామాజిక వైద్యశాల ముందు ధర్నా నిర్వహించాం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మాకు రావాల్సిన మూడు నెలల జీతాలు పిఆర్సి పెరిగిన జీతాలు కూడా వెంటనే ఉద్యోగులకు ఇవ్వాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు
ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్స్ ప్రభుదాస్ గణేష్ శ్వేత సంధ్యారాణి నిర్మల గంగాధర్ లక్ష్మణ్ బతుకమ్మ స్రవంతి రంజిత్ కుమార్ మణిదీప్ రాకేష్ దేవరాజ్ బిక్షపతి గంగ తదితరులు పాల్గొన్నారు.