చర్చ,వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనులు అడ్డుకున్న స్థానికులు….
రాజన్న ఆలయ విస్తరణ పనులు అడ్డుకున్న స్థానికులు....

చర్చ,వేములవాడ:
రాజన్న ఆలయ విస్తరణ పనులు అడ్డుకున్న స్థానికులు….
వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులను శుక్రవారం స్థానిక దుకాణ వ్యాపారులు, ఇండ్ల యజమానులు అడ్డుకున్నారు. రాజన్న ఆలయం దక్షిణం వైపు ఉన్న ప్రధాన రహదారిని 25 అడుగుల విస్తరణకు అదికారులు ప్రతిపాదనలు ఇచ్చారు .ఆలయ విస్తరణ రహదారి పైకి వస్తుండగా రోడ్డు చిన్నగామారతుంది .దీంతో రోడ్డు విస్తరణ చేయడం వల్ల తమ నివాసాలు కోల్పోతామని స్థానికులు అభ్యత్తరం వ్యక్తం చేశారు. రహదారి ఎన్ని అడుగులు ఉండాలో ముందుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. రోడ్డు విస్తరణలో ముందుగా తమకు నోటీసులు జారీ చేసిన తర్వాతే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పనులు ఎలా చేపడతారంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులతో వాగ్వివాదానికి దిగారు.