చర్చ , కొత్తగూడెం : మతోన్మాద ఆగడాలను అట్టుకట్ట వేయకుంటే దేశం అదోగతి పాలవుతుంది – ఎమెల్యే కూనంనేని , నెల్లికంటి సత్యం
ఆగడాలను అట్టుకట్ట వేయకుంటే దేశం అదోగతి పాలవుతుందని

కొత్తగూడెం : మతోన్మాద ఆగడాలను అట్టుకట్ట వేయకుంటే దేశం అదోగతి పాలవుతుందని, మితిమీరుతున్న మత ఛాందస వాదాన్ని నిలువరించేందుకు కమ్యూనిస్టుల ఐఖ్యత అనివార్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎంఎల్ ఏ కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంఎల్‌సి నెల్లికంటి సత్యం పిలునిచ్చారు. సిపిఐ శతవంసత ఉత్సవాలను పురస్కరించుకుని జోగులాంబ గద్వాల్ నుండి ప్రారంభమైన ప్రచార జాత శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలురుపాడు మండలంలోనికి ప్రవేశించింది. నాయకులగూడెం వద్ద తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొమారి రామయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించిన అనంతరం సుజాతనగర్ మండలం మీదుగా కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కొత్తగూడెం పట్టణం పురవీధుల్లో భారీ ర్యాలీ ప్రదర్శన సాగింది. అనంతరం జరిగిన బహిరంగ సభలో కూనంనేని, నెల్లికంటి మాట్లాడారు. దేశప్రజలపై మతజోక్యం నానాటికీ పెరిగిపోతోందని, భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయమైన భారతావనిలో కులమాతల చిచ్చు రేపుతూ ఐఖ్యతకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఓట్లచోరికి పాల్పడుతూ బిజేపి అధికార దర్పాన్ని ప్రదర్శిస్తోందని, దేశంలో ఓటాన్ అకౌంట్ పద్ధతి ప్రవేశపెట్టాలన్నారు. సిపిఐది దేశంలో వందేళ్ల ఘన చరిత్ర అని, ఆ నాటి నుండి నేటి వరకు ప్రజలతో మమేకంపై ఉన్న ఏకైక పార్టీ అని చెప్పారు. దేశస్వాతంత్య్ర సమరంలో ప్రజలను చైతన్య పరుస్తూ బ్రిటీష్ సామ్రాజ్య వాదుల నుండి దేశాన్ని దక్కించుకునేందుకు చారిత్రాత్మక పాత్ర పోషించిందన్నారు. ఇంతటి కీర్తి గల సీపీఐ చరిత్ర, త్యాగాలు, పోరాటాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. అమరుల త్యాగాల స్ఫూర్తి మరో వందేళ్ల పాటు ప్రజాక్షేత్రంలో పోరాట పటిమతో మందుకు సాగుదామని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరవు, ఎం బాలమల్లేశ్ మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో అడవుల్లో ఉన్న సహజ సంపదను కార్పోరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు మోడీ సర్కార్ మావోయిస్టులను బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తోందని, వారిని ముందుగానే పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి అతిదగ్గరినుండి కాల్చి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులను పతనం చేయాలని చూసిన వారు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారని, దౌర్జన్యాలు, హత్యలకు పాల్పడుతూ వ్యక్తులను చంపినా ఉద్యమ శక్తి బ్రతికే ఉంటుందన్నారు. తాము లొంగిపోతామని పడేపడే మావోయిస్టులు చెబుతున్నప్పటికీ తాము విధించిన 2026 మార్చి నెలాఖ గడువునాటికి అంతం చేస్తామని బహిరంగ ప్రకటనలు చేస్తూ చంపడమే ధ్యేయంగా పెట్టుకున్నారని మండిపడుతున్నారు. ప్రక్కనే ఉన్న పాకిస్థాన్‌తో శాంతిచర్చలకు అంగీకరించిన వారు. మన దేశ పౌరులతో ఎందుకు చర్చలకు ఒప్పుకోరని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం ఎన్ కౌంటర్ల పేరిట సాగిస్తున్న హత్యలపై న్యాయవిచారణ చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ భద్రాద్రి, ఖమ్మం జిల్లా కార్యదర్శులు ఎస్ కె సాబీర్ పాషా, దండి సురేష్ మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సాగుతున్న ప్రచారజాత కొత్తగూడెంతో ముగిసిందని, డిసెంబర్ 26న ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఐదు లక్షల మందితో జరిగే శతవసంత ముగింపు సభను జయప్రథం చేయాలని, ఇందు కోసం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున కృషి చేయాలని కోరారు. ఈ వేడుకకు 45 దేశాల నుండి ప్రతినిధులు, దేశవిదేశాల నుండి కవులు, కళాకారులు, మేధావులు, తరలివస్తున్నారన్నారు. జరగనున్న ఈ వేడుక దేశచరిత్రలోనే సువర్ణ అధ్యాయంగా మిగిలిపోనుంది. కమ్యూనిస్టుల పని అయిపోయింది అంటూ అవకాలు చెవాకులు పేలిన వారి నోళ్లు మూతపడేలా, కనీవినీవిరుగరని రీతిలో ఈ శతవసంత ముగింపు సభ జరగనుందన్నారు. చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, వాసిరెడ్డి మురళి అధ్యక్షతన జరిగిన సభలో నాయకులుల కంచర్ల జమలయ్య, జి వీరస్వామి, భూక్య దాస్రు, కందుల భాస్కర్, చండ్ర నరేంద్ర కుమార్, ఎస్ కె ఫహీమ్, కొమారి హనుమంతరావు, గెద్దాడు నగేష్, వంగా వెంకట్, వట్టికొండ మల్లికార్జునరావు ఎస్వీ రమణమూర్తి, నెరేళ్ల రమేష్, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, మాచర్ల శ్రీనివాస్ పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.