చర్చ, ఓదెల: చెక్ డ్యాం కూల్చివేసిన గుర్తు తెలియని దుండగులు….
ఇసుక మాఫియా పనేనంటూ గ్రామస్తుల ఆందోళన

చెక్ డ్యాం కూల్చివేసిన గుర్తు తెలియని దుండగులు
ఇసుక మాఫియా పనేనంటూ గ్రామస్తుల ఆందోళన…?
చర్చ, ఓదెల:
ఓదెల మండలం గుంపుల గ్రామంలో శ్రీ రామభద్ర దేవాలయం సమీపంలో మానేరు వాగుపై సాగు నీటి అవసరాల కోసం మూడు సంవత్సరాల క్రితం19 కోట్ల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యాం ను నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ద్వంసం వేశారు..
దీంతో దిగువకు బారీ స్థాయి నీరు వృదా పొతుంది.
సాగు నీటి అవసరాలు, పక్కనే దేవాలయం ఉండటంతో ఇక్కడ చెక్ డ్యాం నిర్మాణం చేపట్టారు.
గతంతో ఇక్కడ ప్రభుత్వం ఇసుక రీచ్ లు ఏర్పాటు చెయగా ఇసుక రవాణా యదేచ్చగా కొనసాగేది.ఇప్పుడు చెక్ డ్యాం నిర్మాణం చేయడంతో నిండు కుండలా నీరు ఉండటం ఇసుక రవాణాకు బ్రేక్ పడింది.ఇది ఇసుక దొంగల పనేనంటూ గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిండు కుండలా ఉన్న చెక్ డ్యాం కూల్చడం వలన సాగు నీటి ఎద్దడి ఎర్పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెక్ డ్యాం కూల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ,తిరిగి చెక్ డ్యాం మరమత్తులు చేసి రైతులను ఆదుకోవాలని మాజీ సర్పంచ్ ఉప్పుల.సంపత్ కుమార్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.