News & Views

చర్చ,పెద్దపల్లి: బాల్య వివాహలు చేస్తే చర్యలు తప్పవు…

చర్చ,పెద్దపల్లి బాల్య వివాహలు చేస్తే చర్యలు తప్పవు...

చర్చ,పెద్దపల్లి:

చర్చ,పెద్దపల్లి:

బాల్య వివాహలు చేస్తే చర్యలు తప్పవు…

జిల్లా మహిళా సాధికారత ఆధ్వర్యంలో పాలకుర్థి మండలంలోని జయ్యారం జిల్లా పరిషత్ హైస్కూల్ లో శుక్రవారం విద్యార్థులకు బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ సుచరిత మాట్లాడుతూ చిన్నవయసులో వివాహం చేయడం వల్ల అమ్మాయిలు మానసికంగా బలహీన పడతారని, బాల్య వివాహాం వలన శారీరకంగా జరిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. మరియు బాల్య వివాహా నిషేదచట్టం గురించి బాల్య వివాహాల వల్ల చట్టపరమైన శిక్షల గురించి వివరించారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098 కి తెలియజేయాలని కోరారు. పోక్సో చట్టం,బాలల హక్కులు,బాల్య వివాహాలు,బాలకార్మిక వ్యవస్థ మొదలైన వాటిపై అవగాహన కల్పించారు.బాలికలు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మహిళ హెల్ప్ లైన్ 181, జాతీయ అత్యవసర హెల్ప్ లైన్ 112, ఆంటీ డ్రగ్ 14446 లపై బాలికలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపాల్. పురుషోత్తం, సోషల్ వెల్ఫేర్ HWO సంపత్, అధ్యాపక బృందం విద్యార్థినులు పాల్గొన్నారు.