చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ మండల సమైక్య కార్యాలయంలో చీరలు పంపిణీ కి ముందస్తు ఏర్పాట్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
చర్చ
పాల్వంచ మండల సమైక్య కార్యాలయంలో చీరలు పంపిణీ కి ముందస్తు ఏర్పాట్లు కి ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో voa, సీసీ లతో సమావేశం జరిగింది
అయన మాట్లాడుతూ గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ (సెర్ప్ ) ఇందిరా క్రాంతి పథం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ” ఇందిరా మహిళా శక్తి “- మహిళల ఉన్నతి.. తెలంగాణ ప్రగతి,”
కార్యక్రమం లో భాగంగా 18 సంవత్సరాల వయస్సు పైబడిన మహిళలకు,ఏకరూప చీరలు పంపిణీ కార్యక్రమం.
కూనంనేని సాంబశివ రావు, శాసన సభ్యులు, కొత్తగూడెం నియోజకవర్గ ముఖ్య అతిధి గా వారి చేతులు మీదుగా మండల స్థాయిలో పంపిణీ కార్యక్రమం సోమవారం అనగా ది 24-11-2025 సాయంత్రం 3 గం కు, పాల్వంచ మండలం లోని, మున్సిపల్ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించడం జరుగుతుంది, కావున మహిళా సమాఖ్య సభ్యులుకు, మండల స్థాయి అధికారులకు,ప్రజా ప్రతి నిధులు హాజరు కావాలని కోరారు.