News & Views

చర్చ, జగిత్యాల: మల్లనపేట వచ్చే భక్తులకు ఎలాంటి భద్రతా సమస్యలు రావోద్దు – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

భక్తులకు ఎలాంటి భద్రతా సమస్యలు రావోద్దు

మల్లనపేట వచ్చే భక్తులకు ఎలాంటి భద్రతా సమస్యలు రావోద్దు

భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

చర్చ, జగిత్యాల: గొల్ల పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లనపేట గ్రామంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లికార్జున స్వామి (మల్లన్న పేట జాతర) సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. నవంబర్ 26 తేదీ నుండి డిసెంబర్ 17 వ తేదీ వరకు జరుగు జాతర సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఏలాంటి నేరాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో, క్యూలైన్లలో, వాహనాల రాకపోకలు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయవలసిన భద్రత ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితులకు స్పందించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అదేవిధంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించారు. అనంతరం ఎస్పీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఎస్పీ వెంట డిఎస్పి రఘు చందర్, ఎస్బి ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, సి.ఐ రవి, ఎస్.ఐ క్రిషన్ సాగర్ రెడ్డి ఉన్నారు.