చర్చ, జగిత్యాల: 4 లక్షల50 వేల ఎల్. వో. సి అందించిన ఎమ్మెల్యే
4 లక్షల50 వేల ఎల్. వో. సి అందించిన ఎమ్మెల్యే
చర్చ, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని ఓ మహిళ కడుపులో ట్యూమర్ తో బాధపడుతుండగా జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 4 లక్షల 50 వేల రూపాయల ఎల్. వో. సి. ని అందించారు. జగిత్యాల పట్టణం లోని బుకవాడకు చెందిన వావిలాల లక్ష్మీ కడుపులో ట్యూమర్ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్న విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా నిమ్స్ లో శస్త్ర చికిత్స నిమిత్తం 4 లక్షల 50వేల రూపాయల ఎల్.వో.సిని సోమవారం జగిత్యాలలో లక్ష్మి కుటుంబికులకు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అందజేశారు.