చర్చ, సత్తుపల్లి: ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాం- ఖమ్మం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఏ సరిరాం…

ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాం…
ఖమ్మం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఏ సరిరాం…
ఖమ్మం రీజియన్ లో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచినట్లు ఖమ్మం రీజినల్ మేనేజర్ ఏ సరిరాం తెలిపారు. మంగళవారం సత్తుపల్లి డిపో ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుణ్యక్షేత్రాల దర్శన పేరుతో పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని భక్తులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శబరిమలై వెళ్లే అయ్యప్ప స్వాముల సౌకర్యం ఖమ్మం రీజన పరిధిలో అన్ని డిపోల నుండి బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. అయ్యప్పలు వారు సూచించిన రూట్ ప్రకారం బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అన్నారు. యాత్ర దానం దాతలు ముందుకు వచ్చినట్లయితే ప్రత్యేక బస్సులను ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అని ఆయన తెలిపారు. యాత్ర దానం విజయవంతం చేయడానికి దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ప్రయాణికుల రద్దీను బట్టి ఆయారూట్లలో బస్సుల సంఖ్య పెంచినట్లు ఆయన సందర్భంగా తెలిపారు. వివాహది శుభకార్యాలకు అద్దె ప్రాదిపదికన బస్సులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. సత్తుపల్లి బస్టాండ్ ను పరిశీలించారు. గ్యారేజీ సిబ్బందితో సమావేశమయ్యారు. డిపో అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలను డిపో మేనేజర్ ఊటుకూరి సునీత కు వివరించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో సత్తుపల్లి డిపో మేనేజర్ ఊటుకూరి సునీత, అసిస్టెంట్ మేనేజర్ పి విజయ శ్రీ, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ సాహితి, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.