చర్చ, హైదరాబాద్: సమాజ క్షేమమే మీడియా ధ్యేయం కావాలి – విరహాత్ ఆలీ

సమాజ క్షేమమే మీడియా ధ్యేయం కావాలి
- ఘనంగా కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కమిటి ప్రమాణ స్వీకారం
- రిపోర్టర్ల సంక్షేమమే యూనియన్ లక్ష్యమన్న విరహాత్ ఆలీ
చర్చ, హైదరాబాద్ /కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన ప్రెస్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. సోమవారం షాపూర్ నగర్ లోని శుభం బ్వాంకెట్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియూడబ్ల్యూ జే – ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ ఆలీ ముఖ్య అతిధిగా హరయ్యారు. నూతనంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన గోలిపెల్లి దయాకర్ రెడ్డి ని అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సాయిబాబా, రెడ్డెబోయిన మల్లేశ్ లను, కార్యవర్గసభ్యులను సన్మానించి అభినందించారు. ఈ సందర్బంగా విరాహత్ అలీ మాట్లాడుతూ రిపోర్టర్ల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియూడబ్ల్యూ జే – ఐజేయూ) పనిచేస్తుందని అన్నారు. అన్ని కష్ట నష్టాల్లో యూనియన్ ప్రతి ఒక్క రిపోర్టర్ కు అండగా నిలుస్తుందని అన్నారు. అదే సమయంలో ప్రతి విలేఖరి కూడా సమాజం పట్ల భాద్యతగా పనిచేయాలని సూచించారు. అతి త్వరలోనే జరల్నిస్టులు శుభవార్త వింటారని తెలిపారు. జర్నలిస్టుల కోసం నిబద్దతతో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియూడబ్ల్యూ జే – ఐజేయూ) మాత్రమేనని అయన పునరుద్ఘాంటిచారు. విలేఖర్ల పేర్లతో కొంతమంది బెదిరింపులకు పాల్పడుతూ రిపోర్టర్ల వృత్తికి మచ్చ తెస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. త్వరలోనే రిపోర్టర్లకు జర్నలిస్ట్ హెల్త్ కార్దు ద్వారా అన్ని ప్రైవేటు & కార్పోరేట్ హస్పిటల్స్ లో కూడా ఉచితంగా వైద్యం అందబోతుందని తెలిపారు. అనంతరం కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గోలిపెల్లి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో 75 మంది సభ్యులుగా ఉన్న టీయూడబ్ల్యూజే – ఐజేయూ యూనియన్ ఈరోజు 110 మంది సభ్యులతో అతి పెద్ద యూనియన్ గా పటిష్టంగా మారిందన్నారు. కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ నిర్మాణం మధ్యలోనే ఆగిందని దానిని అందరి సహయ, సహాకారాలతో పూర్తి చేసి ఆతి త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. ప్రెస్ క్లబ్ నిర్మాణమే కమిటీ ప్రధాన మొదటి ప్రాధాన్య అంశమని అన్నారు. అలాగే కుత్బుల్లాపూర్ లో రిపోర్టర్లకు పలు సమస్యలు ఉన్నాయని వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించుకుంటామని అన్నారు. మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా కమీటీ అధ్యక్షుడు గడ్డమీది బాల్ రాజ్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీని అభినందిస్తూ యూనియన్ సభ్యుల కోసం నిరంతంర పనిచేస్తున్న సంఘం తెలంగాణా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అని అన్నారు. 70 మంది సభ్యుల నుండి 110 మంది సభ్యులకు పెరగడం అభినందనియని అన్నారు. జిల్లా రిపోర్టర్లకు జిల్లా కమిటీ ఎల్లప్పుడు అండా ఉంటుందని అన్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులకు విరాహత్ ఆలీ చేతులు మీదుగా యూనియన్ సభ్యత్వ కార్దులను అందచేశారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు విరాహాత్ ఆలీని ఘనంగా సన్మానించి, మెమెంటో అందజేశారు. అలాగే అతిధిలుగా హజరైన రాష్ట్ర కోశాధికారి మోతే వెంకట్రాం రెడ్డి, జిల్లా కార్యధర్శి వెంకట్రాం రెడ్డి, నేషనల్ కౌన్సిల్ సభ్యులు నాగేంద్రచారి లను కమిటీ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించి మెమెంటోలు అందజేశారు. ఈ సంధర్బంగా పలువురు రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు నూతన కమీటికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ప్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు జీ. సితారామారావు, దేవెందర్ గుప్తా, కల్కిమూర్తి, వి. సురేశ్ గౌడ్, శ్రీధర్ కార్యనిర్వాహక కార్యదర్శులు రణదేవ్,శేషారెడ్డి, సంయుక్త కార్యదర్శులు జీ శ్రీనివాస్, ప్రవీణ్, ఎండీ అన్వీర్, డా. ఎల్లంపల్లి నర్సింలు, కోశాధికారి చెరుకూరి శివశర్మ, సంతోష్ యాదవ్, లక్ష్మణ్, లియాఖత్ ఆలీ, గ్రంధాలు, సంతోష్, నవీన్ రాజు, నాగబాబు, శ్రీనివాస్, సలహాదారులు గుంటూర్ శేఖర్, నాగేంద్ర చారి, కే వెంకట్, ముక్కర్ల లాలయ్య, గౌస్ మొయినుద్దిన్, సిరిగిరి శ్రీనివాస్, కుంట అనీల్, కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ సభ్యులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.