News & Views

చర్చ, సత్తుపల్లి : వేంసూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏసిపి వసుంధర యాదవ్ ఐపీఎస్…

 

ఖమ్మం జిల్లా వేంసూరు పోలీస్ స్టేషన్ ను ఏ సి పి వసుంధర యాదవ్ ఐపిఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించారు. స్వాధీనం చేసుకున్న వాహనాల ను నేర మరియు నేరస్తుల ట్రాకింగ్ నెట్‌వర్క్ & సిస్టమ్స్ 2.0, ఈ సమ్మన్స్ కఠినంగా ఉపయోగించాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న ఎఫ్ఐఆర్ ను పరిశీలించి రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు ఉన్న వారిని నిశితంగా గమనించాలని శాంతి భద్రతలకు ఆటకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విలేజ్ ప్రొటెక్షన్ కానిస్టేబుల్ నియమించాలని, కేంద్రీయ పరికర గుర్తింపు రిజిస్టర్ లో నమోదైన దొంగలించబడిన మొబైల్ ను త్వరగా రికవరీ చేయాలని ఏసిపి వసుంధర యాదవ్ ఐపిఎస్ ఆదేశించారు. అనంతరం అంతర్రాష్ట్ర వరి ధాన్య చెక్పోస్టును సందర్శించి ఏర్పాట్లు సమీక్షించారు.