News & Views

చర్చ, కొత్తగూడెం: బీసీల రిజర్వేషన్ల కోసం బీఎస్పీ ముందుంటుంది- కురిమెల్ల శంకర్

చర్చ, కొత్తగూడెం

బీసీల రిజర్వేషన్ల కోసం బీఎస్పీ ముందుంటుంది- కురిమెల్ల శంకర్

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీయో 46 ను వెంటనే రద్దు చేసి, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద నిరసన నిర్వహించారు. ఈ నిరసనలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరపున ప్రధాన ఆకర్షణగా పాల్గొన్న కొత్తగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జ్ కురిమెల్ల శంకర్ బీసీల హక్కుల కోసం గట్టిగా స్వరం వినిపించారు.“బీసీల జనాభాకు సరిపడ న్యాయం చేసేది బీఎస్పీ మాత్రమే. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు అందించడంలో బీఎస్పీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని నిజమైన అర్థంలో రక్షించే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. బీసీలు, దళితులు, మాదిగలు, పేద వర్గాల అభివృద్ధి కోసం పోరాడేది బీఎస్పీ తప్ప మరే పార్టీ కాదు అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బీసీల జనాభా 50%కు పైగా ఉన్నా 17% రిజర్వేషన్ కేటాయించడం తీవ్ర అన్యాయమని ఆయన మండిపడ్డారు. బీసీల రిజర్వేషన్లను తగ్గిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక అగ్రవర్ణ శక్తుల ఒత్తిళ్లు ఉన్నాయని విమర్శించారు. జీవో 46 ను రద్దు చేయాలి, 42 శాతం రిజర్వేషన్‌ను వాగ్దానం చేసినట్లుగానే అమలు చేయాలి,
బీసీల రాజకీయ శక్తిని బలపరచడానికి బీఎస్పీ రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమాలకు సిద్ధమవుతోందని తెలిపారు. బహుజన సమాజ్ పార్టీ రాబోయే ఎన్నికల్లో 119 సీట్లలో 60 సీట్లు బీసీలకు ప్రాధాన్యతగా కేటాయించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతరుల స్పందనలు బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కొదుమూరి సత్యనారాయణ, వైస్ చైర్మన్ కవడగాని శ్రీనివాస్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాంబాబు, జిల్లా అధ్యక్షుడు అంకినీడు ప్రసాద్ మాట్లాడి బీసీల రిజర్వేషన్ తగ్గింపును తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో కావట్టి సమ్మయ్య, మాదా శ్రీరాములు, కాసోజు రామాచారి, గుమ్మలాపురం సత్యనారాయణ, బిక్షపతి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.