News & Views

చర్చ,పెద్దపల్లి: లేబర్ కోడ్ లను రద్దు చేయాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా..

 

లేబర్ కోడ్ లను రద్దు చేయాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా..

చర్చ,పెద్దపల్లి: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలంటూ
పెద్దపెల్లి కలెక్టరేట్ ముందు ఆల్ ట్రేడ్ యూనియన్స్ ,రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద గణేష్, రైతు సంఘం జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడలను రద్దు చేయాలని, శ్రమశక్తి నీతి పాలసీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలని, వ్యవసాయ కార్మికుల వేతనాలు పెంచాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలన్నారు. వందరోజుల పనిని రెండు వందల రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాలు అమలు చేయడం వలన దేశ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టి వేయబడుతాయని ఆందోళన వ్యక్తం చేసారు. లేబర్ కోడ్ లు రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల రాజారెడ్డి, వేల్పుల కుమారస్వామి,మెoడే శ్రీనివాస్, డి, కొమరయ్య, సిపెల్లి రవీందర్, ఎం, రామాచారి, ఎన్, బిక్షపతి, సిహెచ్, అరవింద్, సురేష్, తాండ్ర అంజయ్య , ఎస్, వెంకట స్వామి, ఎండి, కాజా, ఎం,సారయ్య, ఆరేపల్లి రాజమౌళి, హైమద్ భాషా, మాతంగి రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.