చర్చ, జగిత్యాల: భాషా పండితులకు అదే సబ్జెక్ట్ కే టెట్ నిర్వహించాలి – టి. వై. ఎమ్. ఎస్. ఈ. యు రాష్ట్ర శాఖ అధ్యక్షులు స్వామి యాదవ్
భాషా పండితులకు అదే సబ్జెక్ట్ కే టెట్ నిర్వహించాలి
– టి. వై. ఎమ్. ఎస్. ఈ. యు రాష్ట్ర శాఖ అధ్యక్షులు స్వామి యాదవ్
జగిత్యాల: సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు, నిరుద్యోగ భాషా పండితులకు చేపట్టే టెట్ అర్హత పరీక్ష లో అదే సబ్జెక్టు లోనే టెట్ అర్హత పరీక్ష నిర్వహించాలని టి. వై. ఎమ్. ఎస్. ఈ. యు రాష్ట్ర శాఖ అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం విడుదల చేసిన ప్రకటన లో ఇన్ సర్వీస్ టీచర్ల కు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. తప్పని సరి పరిస్థితి నేపథ్యంలో ఆయా భాషా పండితుల కు చెందిన సబ్జెక్టు లోనే పరీక్ష నిర్వహించాలని ఇతర సబ్జెక్టు ల ప్రశ్నలు తొలగించాలని కోరారు. భాషా పండితులు తరగతి గదుల్లో తమ సబ్జెక్టు మాత్రమే బోధిస్తారని వీరికి ఇతర సబ్జెక్టు లపై పట్టు ఉండదన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన టెట్ పరీక్షల్లో నిరుద్యోగ భాషా పండితులు, ఇన్ సర్వీస్ టీచర్లు ఇతర సబ్జెక్టుల మూలంగా, వారు చదివిన భాషా సబ్జెక్టు కు తక్కువ మార్కులు కేటాయించడం మూలంగా ఉత్తిర్ణత చెంద లేకపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో నిర్వహించినున్న టెట్ అర్హత పరీక్ష లో భాషా పండితులకు వారి భాష సబ్జెక్టు తోనే టెట్ నిర్వహించాలని అప్పుడే న్యాయం జరుగుతుందని వేల్పుల స్వామి యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.