News & Views

చర్చ : కొత్తగూడెం, నవభారత్ పబ్లిక్ స్కూల్ విద్యార్ధిని బొమ్మసాని సుగంధినికి అంతర్జాతీయ గుర్తింపు, అమెరికాకు ఆహ్వానం…

చర్చ : కొత్తగూడెం,

నవభారత్ పబ్లిక్ స్కూల్ విద్యార్ధిని బొమ్మసాని సుగంధినికి అంతర్జాతీయ గుర్తింపు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం నిర్వహిస్తున్న అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనంలో పాల్గొనటానికి ఆహ్వానం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం TANA ప్రపంచ సాహిత్య వేదిక ప్రతిష్టాత్మకంగా నవంబర్ 30, 2025 ఆదివారం అంతర్జాలంలో ప్రతిష్టాత్మకంగా 13 గంటల పాటు బాలసాహిత్య భేరి పేరుతో “అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనం” నిర్వహిస్తుంది.

ఈ విశేషమైన కార్యక్రమంలో పాల్గొనటానికి తెలంగాణ రాష్ట్రం,భద్రాద్రి కొత్తగూడెంజిల్లా, పాల్వంచ లో ఉన్న నవభారత్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని బి.సుగంధిని D/O బి.విజయ ప్రకాష్ ఎంపికయింది.

కథ, వచన కవిత్వం, గేయం, పద్యం విభాగాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు విద్యార్థిని విద్యార్థులు 101 మంది కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ చిన్నారి కథ విభాగంలో ఎంపికైందని మూడు నిమిషాల పాటు కథ వినిపిస్తుందని పాఠశాల కరస్పాండెంట్ సంతోష్ గారు,ప్రిన్సిపల్ ఎన్.వి.కె ప్రసాద్ గారు హర్షాన్ని వ్యక్తంజేశారు.

విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్ లర్లు, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు, ప్రఖ్యాత బాల సాహితీవేత్తలు, జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొంటున్న ఈ

అంతర్జాతీయ కార్యక్రమంలో తమ పాఠశాల విద్యార్థినికి అరుదైన అవకాశం కల్పించిన తానా అధ్యక్షులు డాక్టర్ నరేన్ కొడాలి గారికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి, సమన్వయకర్త శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.