చర్చ, సత్తుపల్లి: జాతీయ యూనిఫైడ్ సైబర్ఒలింపియాడ్ లో సత్తా సాటిన సత్తుపల్లి విద్యార్థులు…
జాతీయ యూనిఫైడ్ సైబర్ఒలింపియాడ్ లో సత్తా సాటిన సత్తుపల్లి విద్యార్థులు..
చర్చ, సత్తుపల్లి:
జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పరీక్ష యూనిఫైడ్ సైబర్ ఒలింపియాడ్ ( యూ.సి.ఓ)లో సత్తాచాటిన సత్తుపల్లి విద్యాలయం, శ్రీ చైతన్య కరికులం విద్యార్థులు.గత నెల నిర్వహించిన యూనిఫైడ్ సైబర్ ఒలింపియాడ్ పరీక్షల్లో ఆల్ ఇండియా స్థాయిలో విశిష్ట ఫలితాలు సాధించారు.
ఈ ప్రతిష్టాత్మక పరీక్షల్లో ఆల్ ఇండియా 7వ ర్యాంక్‌ను దాసరి ఖాస్వి, 10వ ర్యాంక్‌ను ఆర్. కెనీషా, 12వ ర్యాంక్‌ను మన్విత సాధించారు. ఈ ముగ్గురు విద్యార్థులు క్యాష్ ప్రైజ్, గోల్డ్ మెడల్, అవార్డు సర్టిఫికేట్ అందుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అదేవిధంగా బాలుర విభాగంలో తన్షిక్ నాయుడు, సాయి చరణ్, సాత్విక్, హర్ష వర్ధన్ మంచి ప్రతిభ కనబరుచుతూ గోల్డ్ మెడల్, సర్టిఫికేట్లను గెలుచుకున్నారు.
విజయం సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్స్ శ్రీధర్ గారు, శ్రీ విద్యా మేడమ్, ఖమ్మం జోన్ కోఆర్డినేటర్ కృష్ణారావు గారు ఇలాంటి జాతీయ స్థాయి పోటీల్లో చురుకుగా పాల్గొని, మీ ప్రతిభను దేశవ్యాప్తంగా ప్రదర్శించండి. మరిన్ని అవార్డులు సాధించే లక్ష్యంతో ముందుకు సాగండి” అని అభినందించారు
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నాగరాజు, వైస్ ప్రిన్సిపాల్ అజిత, డీన్ ఎన్.వి.ఆర్,
సి- ఇన్‌ఛార్జ్ నాగార్జున, ఐఎన్‌టీఎస్ఓ- ఇన్‌ఛార్జ్ సుభాకర్ ,మరియు ఉపాధ్యాయ బృందం
విద్యార్థులను అభినందించారు.