చర్చ, సత్తుపల్లి: బస్సును ఢీ కొట్టి రైలింగ్ పై నుండి పల్టీలు కొట్టిన లారీ…40 మంది విద్యార్థులకు తప్పిన ప్రమాదం

బస్సును ఢీ కొట్టి రైలింగ్ పై నుండి పల్టీలు కొట్టిన లారీ…40 మంది విద్యార్థులకు తప్పిన ప్రమాదం
చర్చ, సత్తుపల్లి:
సత్తుపల్లి శివారు పెద్దవంతెన బ్రిడ్జి వద్ద చేపల మేత లోడ్ తో రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ సత్తుపల్లి వైపు వస్తున్న సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీ బస్సును స్వల్పంగా ఢీకొట్టి అదుపుతప్పి పల్టీలు కొట్టి కిందకు పడిపోవడంతో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి.. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో 40 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.. మద్యం మత్తులో లారీ నడుపుతూ గాయపడిన లారీ డ్రైవర్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.