News & Views

చర్చ, కొత్తగూడెం : స్థానిక పంచాయితీ ఎన్నికల్లో మేము సిద్ధం – జనసేన

స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ సిద్ధం

చర్చ, ములకలపల్లి

జెనసేన సిద్దం

స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ సిద్ధంగా ఉన్నట్లు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా వర్కింగ్ కమిటీ, అలాగే పవన్ కళ్యాణ్ సేవా సమితి అధ్యక్షులు ఇనుకుర్తి రాము ఒక ప్రకటనలో కోరారు. జనసేన కార్యకర్తలు అభిమానులు అంతా కూడా తమ పార్టీ కోసం నిజాయితీగా పనిచేయాలని జనసేన పార్టీ తరుపున అభ్యర్థించారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు నిస్వార్ధంగా నిజాయితీగా స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకోవాలని పార్టీ తరుపున కోరారు. ఈ ఎన్నికలకు సంబంధించి జనసేన తో కలిసి పనిచేసే పార్టీలతో కలిసి పనిచేయడానికి జనసేన సిద్ధంగా ఉందన్నారు. నిజాయితీగా జనసేన అభిమానులు గాని, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గాని పోటీ చేయదలచుకున్న వ్యక్తులు తమ తమ అభిప్రాయాలను నేరుగా పార్టీ ఆఫీసును సంప్రదించాలని వివరించారు. మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్, నెంబర్ 6281944188, అలాగే పార్టీ ఉమ్మడి జిల్లా వర్కింగ్ కమిటీ, పవన్ కళ్యాణ్ సేవాసమితి ఇనుకుర్తి రాము 7989197559 నెంబర్లను సంప్రదించాల్సిందిగా కోరారు.