చర్చ,కొండగట్టు: కొండగట్టులో బారీ అగ్ని ప్రమాదం…. కాలిబూడిదైన దుకాణ సముదాయాలు…
20 దుకాణాలు అగ్నికి ఆహుతి.. బారీగా ఆస్థి నష్టం...

చర్చ,కొండగట్టు:
కొండగట్టులో బారీ అగ్ని ప్రమాదం….
కాలిబూడిదైన దుకాణ సముదాయాలు…
20 దుకాణాలు అగ్నికి ఆహుతి..
బారీగా ఆస్థి నష్టం…
జగిత్యాల జిల్లా మల్యాల మండలం దిగువ కొండగట్టులో శ్రీనాథ్ టౌన్ షిప్ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఘోర
అగ్ని ప్రమాదం జరిగింది. బొమ్మల షాపులన్నీ కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 20 షాపులు అగ్నికి అహుతయ్యాయి. నిద్రలోకి జారుకున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటం..
అరుపులు కేకలతో దుకాదారులు బయటకు పరుగులు తీశారు.ప్రాణాలతో బయటపడ్డారు.
షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ భారీ ప్రమాదం
చోటుచేసుకున్నట్లు సమాచారం. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో మూడు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బారీ మంటలను అదుపు చేశారు. బొమ్మలు,
ప్లాస్టిక్ వస్తువులు, వెదురు బొంగుల పందిళ్లు కావడంతో
మంటలు వేగంగా వ్యాపించాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికి బారీగా ఆస్థినష్టం వాటిల్లింది.
ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో స్థానికులు
భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. అయితే,
జీవనోపాధి కోల్పోవడంతో బాధిత కుటుంబాలు బోరున
విలపిస్తున్నాయి. కడుపు నింపే దుకాణలు కండ్ల ముందే
కాలిబూడిద కావడంతొ కన్నీరుమున్నీరయ్యారు.
ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకొంటున్నారు..