News & Views

చర్చ , ఇల్లందు : స్వీట్ షాప్ వ్యాపారం… (గంజాయి) మత్తు పదార్థాల తరలింపు వ్యవహారం

ఛేదించిన పోలీసులు

చర్చ , ఇల్లందు : స్వీట్ షాప్ వ్యాపారం..(గంజాయి) మత్తు పదార్థాల తరలింపు వ్యవహారం…

చేదించిన పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. టేకులపల్లి పోలీస్ స్టేషన్ లో ఇల్లందు డిఎస్పి చంద్ర భాను ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సీఐ సత్యనారాయణ ఎస్సైలు రాజేందర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ… టేకులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయన్నపేట క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాధాస్పదంగా వచ్చిన కారుని పరిశీలించగా అందులో గంజాయి ఉన్నట్టు గుర్తించడం జరిగిందన్నారు. గంజాయి తరలిస్తున్న ముద్దాయి లాల్ సింగ్ చౌహాన్, ఏపీ అల్లూరి సీతారామరాజులో స్వీట్ షాప్ యజమాని గా గుర్తించినట్టు తెలిపారు. పోలీసులను గుర్తించి రహదారి పక్కన చెట్టును ఢీకొని ఒక సిమెంట్ దిమ్మెకు గుద్దుకొని కారు ఇరుక్కుపోవడంతో పోలీసులు తనిఖీ నిర్వహించగా కారు డిక్కీలో మరియు మద్య సీట్లో గంజాయిని ఉన్నట్టు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న 199.67 కేజీల గంజాయి దీని విలువ 99.83 లక్షల విలువ ఉన్నట్టు డిఎస్పి తెలిపారు. నిందితుడు పై ఇప్పటికే ఏపీలో మూడు కేసులు ఉన్నాయని నిందితుడిని రిమాండ్ నిమిత్తం ఇల్లందు న్యాయస్థానంలో హాజర పరుస్తామని డిఎస్పి తెలిపారు