News & Views

చర్చ, జగిత్యాల: అంబేద్కర్ ఆశయాలు అచరణ యోగ్యం- డిసిసి ప్రెసిడెంట్ నందయ్య

అంబేద్కర్ ఆశయాలు అచరణ యోగ్యం- డిసిసి ప్రెసిడెంట్  నందయ్య

చర్చ, జగిత్యాల: అంబేద్కర్ ఆశయాల సాధన ప్రతి ఒక్కరి భాద్యత అని, ఆయన ఆశయాలు ఆచరణ యోగ్యమని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గాజంగి నందయ్య అన్నారు.
జగిత్యాల జిల్లాలో కేంద్రంలో ఆదివారం ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కార్యవర్గసభ్యుడు, డిక్కి జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం కార్యక్రమం లో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య పూల మాలతో నివాళ్లు అర్పించి సేవలను స్మరించారు.
ఈ సందర్బంగా ముఖ్య అతిథి గాజంగి నందయ్య మాట్లాడుతూ భారత రాజ్యంగాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిపిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ గారని పేర్కొన్నారు. ప్రపంచంలో దేశాల్లో వారి వారి విశ్వాసాలను బట్టి భగవంతుని తరువాత అంబేద్కర్ని కొలుస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జై భీమ్… జై సంవిధన్… నినాదంతో రాజ్యాంగం పరిరక్షణకు చిత్త శుద్ధితో పని చేస్తుందని అన్నారు. తాను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని డీసీసీ ప్రెసిడెంటుగా నియామకం కబడ్డానంటే కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం దక్కుతుందని ఉదాహరణ అని స్పష్టం చేశారు. ఈ గొప్ప కార్యక్రమం ప్రతి మండల్ కేంద్రం, గ్రామాల్లో నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రంలో తక్కళ్ళ దేవయ్య మట్టిపూలు పత్రిక సంపాదకులు, బండ శంకర్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి, తుల కాంతారావు తెలంగాణ శక్తి ఎడిటర్, కాయితీ శ్రీనివాస్ ప్రెసిడెంట్, జిల్లా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం, కల్లేపల్లి దుర్గయ్య తాజా మాజీ కౌన్సిలర్,కంటె అంజయ్య ప్రధాన కార్యదర్శి పట్టణ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, బొల్లం ప్రభాకర్, రుద్ర మనోహర్, దాసండ్ల కమలాకర్, దుమాల గంగాధర్ దళిత సంఘాల సీనియర్ నాయకులు జగిత్యాల జిల్లా, సంకె మహేష్,కటుకం రమేష్, మొహమ్మద్ ఫరీద్,అరికిళ్ల రాజేష్, బండ్ర మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.