చర్చ, జగిత్యాల : వృక్ష శాస్తంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కు డాక్టరేట్
వృక్ష శాస్తంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కు డాక్టరేట్
చర్చ, జగిత్యాల : జగిత్యాల లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో వృక్ష శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సుజాత డాక్టరెట్ పట్టాను అందుకొన్నారు.
వృక్ష శాస్త్రంలోని టీష్యు కల్చర్ ఫైటో కెమికల్ అనాలాసిస్ ఆండ్ ఫార్మ కాలజికల్ స్టడీస్ ఇన్ రూబీయా కార్డి ఫోలియా అనే మొక్క పైన రీసెర్చ్ పూర్తి చేసిన సుజాత థీసిస్ సబ్మిట్ నవంబర్ 26 న అందజేశారు. గత ఎనిమిది ఏండ్లుగా పరిశోధనపూర్తి చేయగా కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పి హెచ్ డి పట్టాను అందుకొన్నారు. ఈసందర్భంగా మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కల్వకుంట రామకృష్ణ, వృక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జి చంద్రయ్య, వైస్ ప్రిన్సిపల్ ప్రమోద్ కుమార్, డాక్టర్ వాసవి, డాక్టర్ సంగీత రాణి, డాక్టర్ నీరజ, మల్లికార్జున్, డాక్టర్ వాసాల వరప్రసాద్, రామచంద్రం, సంకీ సత్యం, గొల్లపల్లి తిరుపతి, సునీత, జ్యోత్స్న, సంగీత, సాయి, నరేష్, మల్లేశం, గీత మొదలైన కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.