చర్చ, జగిత్యాల : ఎన్నికల కోడ్ ముఖ్య మంత్రి, మంత్రులకు వర్తించదా..? – తాజామాజీ జడ్పి చైర్మన్ దావ వసంత సురేష్
ఎన్నికల కోడ్ ముఖ్య మంత్రి, మంత్రులకు వర్తించదా..?
- ఎన్నికల కమిషన్ స్పందించాలి
- ముఖ్య మంత్రి పర్యటన ఆపేయ్యాలి –
తాజామాజీ జడ్పి చైర్మన్ దావ వసంత సురేష్_
చర్చ, జగిత్యాల : రాష్ట్ర ముఖ్యమంత్రి కి, రాష్ట్ర మంత్రులకు ఎన్నికల కమిషన్ నియమావలి వర్తించదా అని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఎలక్షన్ కమిషన్ ను ప్రశ్నించారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో వసంత మాట్లాడుతూ నవంబర్ 26 సాయంత్రం నుంచి కోడ్ అమలుపై ఎలక్షన్ కమిషన్ స్పష్టత ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోడ్ అమలులో ఉండగా సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పేరుతో జిల్లాల పర్యటన చేయడం ముమ్మాటికీ కోడ్ ఉల్లాంఘన కిందకే వస్తుందన్నారు. రాజ్యాంగ బద్ధమైన కుర్చీలో కూర్చొని రాజ్యాంగ సంస్థలపై కనీసం విశ్వాసం, గౌరవం లేకపోవడం, వాటికి విలువ ఇవ్వకపోవడం సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తులకు తగదన్నారు. ప్రభుత్వ సొమ్ముతో అర్బన్ ఏరియాల్లో అభివృద్ధి పనుల నెపంతో గ్రామాల నుండి జనాలను పోగేసి మీటింగ్ లు పెట్టి, ప్రభుత్వం తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించాలనే ప్లాన్ వేశారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ పనితీరును అపహాస్యం చేసేలా, కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలనే ఆలోచనతో కార్యక్రమం రూపొందించుకోవడం సరికాదన్నారు. ఎన్నికల కమిషన్ స్పందించి తక్షణమే పర్యటన నిలిపి వేసేలా కమిషన్ ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్ నాయకత్వంలో, జగిత్యాల బీఆర్ ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. సీఎం స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లాంఘించడం విచారకరం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్ బి ఆర్ ఎస్ నాయకులు శీలం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.