News & Views

సత్తుపల్లి ఎంపిడిఓ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ను సందర్శించిన సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్…..

చర్చ, సత్తుపల్లి:

స్థానిక సంస్థలకు డిసెంబర్ నెలలో 17 న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్లు,ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించడానికి సత్తుపల్లి పట్టణంలోని స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో సోమవారం రోజు మధ్యాహ్నం కల్లూరు రెవిన్యూ డివిజన్ అధికారి సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఎంపీడీవో ఆఫీస్ లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను సందర్శించినారు.పోలింగ్ స్టేషన్ వారిగా మెటీరియల్ సెగ్రేషన్ చేస్తున్నామని ఎంపీడీవో తెలియజేశారు,అదే విధంగా కిష్టారం గ్రామ పంచాయతీ క్లస్టర్ ను కూడా విజిట్ చేశారు.ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎంపీడీవో,సత్తుపల్లి తాహసిల్దార్,మాస్టర్ ట్రైనీ మధు,ఎంపీవో,కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.