చర్చ, జగిత్యాల : ప్రావీడెంట్ ఫండ్ ఫైనల్ పేమెంట్ కు వడ్డీ కలపండి – జడ్పీ సీఈఓ ను కోరిన పి.ఆర్ టి.యు.టి.ఎస్ జగిత్యాల జిల్లా శాఖ!
ప్రావీడెంట్ ఫండ్ ఫైనల్ పేమెంట్ కు వడ్డీ కలపండి – జడ్పీ సీఈఓ ను కోరిన పి.ఆర్ టి.యు.టి.ఎస్ జగిత్యాల జిల్లా శాఖ_
చర్చ, జగిత్యాల : జగిత్యాల జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులలో విరమణ పొందుతున్న ఉద్యోగ ఉపాధ్యాయుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ 2023_25 ఆర్థిక సంవత్సరం వడ్డీ కలిపి ఫైనల్ పేమెంట్ చేయాలని జడ్పి సి. ఈ వో గౌతమ్ రెడ్డిని పి.ఆర్.టి.యు.టి.ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయిని పెల్లి ఆనంద్ రావు, యాల్ల అమర్నాథ్ రెడ్డి వినతి పత్రంలో కోరారు. జిల్లా పరిధిలో దాదాపు 30 మంది ఉద్యోగ ఉపాధ్యాయుల జిపిఎఫ్ ఫైనల్ పేమెంట్స్ ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. అలాగే మరో వినతి పత్రాన్ని ఉప ముఖ్య కార్యనిర్వాహణ అధికారి నరేష్ కు అందించారు.