News & Views

చర్చ: సత్తుపల్లి: గ్రీన్ ఫీల్డ్ హాయ్యవే పై ఆవులు లోడ్ తో వెళుతున్న ఆటో బోల్తా…

గ్రీన్ ఫీల్డ్ హాయ్యవే పై ఆవులు లోడ్ తో వెళుతున్న ఆటో బోల్తా…

చర్చ, సత్తుపల్లి:

పెనుబల్లి మండల పరిధిలో ని కుప్పెనకుంట్ల హాయ్యవే వద్ద ఆవుల లోడ్ తో వెళుతున్న ఆటో బోల్తా కొట్టింది. సత్థూపల్లి వైపు నుండీ ఖమ్మం వైపు వెళుతున్న ఆటో కుప్పెనకుంట్ల ఎగ్జిట్ పాయింట్ వద్ద రోడ్డు పై వున్న దాన్యం కుప్ప తప్పించే క్రమంలో ఆటో బోల్తా కొట్టింది. దేంతో ఆటో లోని ఆవులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆటోలో వున్న స్పేర్ టైర్ పక్కనే వెళుతున్న ద్విచక్ర వాహన దారుడికి తగిలి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. వి ఎమ్ బంజర్ పోలీసిలు సంఘటనా స్థాలానికి చేరుకొని విచారణ చేపట్టారు.