News & Views

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో పలు పాన్ షాప్ లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు.

అశ్వారావుపేట మండలంలో పలు పాన్ షాప్ లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ” చైతన్యం – డ్రగ్స్ పై యుద్ధం ” కార్యక్రమంలో భాగంగా అశ్వారావుపేట పట్టణంలోని వివిధ పాన్ షాప్ లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి, నిషేధిత మత్తు పదార్థాలు ఏమైనా విక్రయిస్తున్నారా లేదా అని సోదలు నిర్వహించారు. చట్ట ఎవ్వరైన చట్టాలను అతిక్రమించి చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలు సాగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుట్కా, గంజాయి వంటి మత్తు పదార్థాలు ఎవ్వరైనా ఏ పాన్ షాపులలో అయిన విక్రయిస్తున్నట్టు తెలిస్తే పోలీస్ వారికి సమాచారం అందించవలసిందిగా ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఇట్టి కార్యక్రమంలో అశ్వారావుపేట సి నాగరాజు, ఎస్సైలు యయాతి రాజు, రామూర్తి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.