చర్చ, సత్తుపల్లి: కోతులు బాబోయ్ కోతులు…

కోతులు బాబోయ్ కోతులు…
చర్చ, సత్తుపల్లి:
సత్తుపల్లి పట్టణంలో గల మారుతి నగర్ వాసులు కోతుల బెడద తట్టుకోలేక సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు.
గత కొన్ని నెలలుగా కోతులు మారుతీ నగర్ లో నివసిస్తున్న మహిళలు, పిల్లలు, పెద్దలు అందరిపై దాడులు చేస్తూ భయాందోళనను సృష్టిస్తున్నాయి. కోతులు బారి నుంచి మమ్మల్ని రక్షించాలని మారుతీ నగర్ వాసులు పిల్లలు పెద్దలు మహిళలతోపాటుభారీ ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కమిషనర్ నరసింహ కు వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ కమిషనర్ నరసింహ స్పందిస్తూ వెంటనే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.