News & Views

చర్చ, సత్తుపల్లి: మున్సిపాలిటీ కార్మికుల వేతనాల కొరకు నిరవధిక సమ్మె నోటీస్…..

మున్సిపాలిటీ కార్మికులు వేతనాల కొరకు నిరవధిక సమ్మె నోటీస్…..

చర్చ, సత్తుపల్లి:

కల్లూరు మున్సిపాలిటీ కార్మికులు వేతనాలు కొరకు సమ్మె నోటీసులు మున్సిపాలిటీ కమిషనర్ కు మంగళవారం అందించారు. గత ఆరు నెలలుగా మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఆరు నెలలు పూర్తయిన కూడా వేతనాలు అందకపోవటంతో సమ్మె నోటీసును మున్సిపాలిటీ కార్యాలయంలో మేనేజర్ నాగేశ్వరరావుకు కార్మికులు అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు వేము రాంబాబు మాట్లాడుతూ మున్సిపాలిటీ కార్మికులకు గత ఆరు నెలలుగా పెండింగ్ 79 లక్షలు ఉండగా ఒక్కొక్కరికి 87000 రావాల్సి ఉంది కార్మికులు వేతనాలు రానందున అప్పుల పాలై కుటుంబాలు భారంగా మారాయని గతంలో జిల్లా కలెక్టర్ ,సబ్ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే లకు, వినతి పత్రాలు ద్వారా తెలియపరచిన కూడా స్పందన లేకపోవడంతో మంగళవారం నిరవధిక సమ్మెకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగిందని సుమారుగా 100 మంది కార్మికులు గత ఆరు నెలలుగా పస్తులు ఉంటూ కుటుంబం గడవక అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారని 18వ తేదీ నుండి విధులు పూర్తిగా బహిష్కరిస్తూ సమ్మెకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. గత్యంతరం లేక నిరవధిక సమ్మెలోకి వెళ్ళటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దామాల దయాకర్ రావు జిల్లా నాయకులు మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఊడల కృష్ణమూర్తి కార్యదర్శి వజీర్మియా, ప్రకాష్, చింత పంటి శ్రీను, సుధాకర్, ప్రవీణ్ ,నరసింహారావు యశోద ,సీతమ్మ, చింతపల్లి శీను బాబు గౌడ్ మణిరాజు చార్లెస్చి చిన్న లతోపాటు తదితరులు కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.