చర్చ, జగిత్యాల : ఏకగ్రీవమైన వడ్డెరకాలనీ పాలక వర్గం – అభినంధించిన ఎమ్మెల్యే
ఏకగ్రీవమైన వడ్డెరకాలనీ పాలక వర్గం – అభినంధించిన ఎమ్మెల్యే
చర్చ, జగిత్యాల : జగిత్యాల నియోజకవర్గం లోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలే ఎక్కువుండాలని ఎప్పుడు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిలుపు నిస్తూనే ఉంటారు. ఇదే కోవలో సారంగాపూర్ మండలం లోని రంగపేట వడ్డెర కాలనీ గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్ని కైంది. బుధవారం జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను నూతన గ్రామపంచాయతీ సర్పంచ్ పల్లపు మాధవి బాపిరాజు, ఉపసర్పంచ్ చెల్ల లావణ్య మల్లేశం, వార్డు సభ్యులు పోగుల ఎల్లయ్య, బోదాసు మధువర్ష, పల్లపు నాంపల్లి, దండగుల రమేష్, పల్లపు పుష్పలతలను ఎమ్మెల్యే శాలువాతో సన్మానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ముస్కు ఎల్లారెడ్డి, మద్దెల ఆనంద్, గిరి నాగభూషణం, అడువాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.