News & Views

చర్చ, జగిత్యాల: దివ్యాంగ విద్యార్థులను ఆదరించండి – జిల్లా విద్యాధికారి రాము

దివ్యాంగ విద్యార్థులను ఆదరించండి

జిల్లా విద్యాధికారి రాము

చర్చ, జగిత్యాల దివ్యాంగ విద్యార్థులను ఆదరించాలని వారందరిని దేవుడిచ్చిన ప్రసాదంగా భావించాలే తప్ప భారంగా భావించరాదని జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము అన్నారు. స్థానిక భవితా కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బహుమతుల ప్రధానోత్సవకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డి.ఈ. వో హాజరయ్యారు. ఈ సందర్బంగా రాము మాట్లాడుతూ దివ్యాంగులను ప్రోత్సహించి శారీరక మానసిక ఎదుగుదలకు తోడ్పడాలని వారన్నారు. పి.ఆర్.టి.యు.టి.ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు బోయిని పెల్లి ఆనంద్ రావు మాట్లాడుతూ దివ్యాంగులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతి విభాగాల్లో ఎదగాలన్నారు. దివ్యాంగుల దినోత్సవం ముఖ్య ఉద్దేశము దివ్యాంగులను గౌరవించి వారి అవసరాలను తీర్చి సమాన హక్కులు కల్పించి సమాజాభివృద్ధిలో భాగస్వాములు చేయాలన్నారు. ఈసందర్భంగా దివ్యాంగ విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీల లో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా విద్యాధికారి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఐ.ఆర్.ఈ.పిలు రాజేందర్, రాజబాబు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు