News & Views

చర్చ,సత్తుపల్లి: జనావాసాల్లోకి చుక్కల దుప్పి….

జనావాసాల్లోకి చుక్కల దుప్పి….

చర్చ, సత్తుపల్లి:

సత్తుపల్లి పట్టణంలోని బైపాస్ రోడ్ సమీప ప్రాంతంలో ఒక చుక్కల దుప్పి (Spotted Deer) జనావాసం వైపు ప్రవేశించింది సమాచారం అందుకున్న వెంటనే సత్తుపల్లి అటవీ రేంజ్ సిబ్బంది వేగంగా స్పందించి, దుప్పిని సురక్షితంగా స్వాధీనపరచుకున్నారు. దుప్పిని పరిశీలించగా ఎటువంటి గాయాలు లేనందున, దుప్పిని అవసరమైన జాగ్రత్తలతో తీసుకెళ్లి నీలాద్రి అర్బన్ పార్క్ అటవీ ప్రాంతంలో సహజ వాతావరణంలో విడిచిపెట్టడం జరిగింది.అటవీ శాఖ తరఫున సమాచారాన్ని వెంటనే అందించిన ప్రజలకు, స్థానిక యువతకు, మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. వారి సహకారంతో వన్య ప్రాణి రక్షణ చర్యలు మరింత వేగంగా, సమర్థవంతంగా పూర్తయ్యాయి.అని తెలియజేశారు.