చర్చ, జగిత్యాల: ఎకగ్రీవ కార్యవర్గాలను సన్మానించిన ఎమ్మెల్యే
ఎకగ్రీవ కార్యవర్గాలను సన్మానించిన ఎమ్మెల్యే
చర్చ, జగిత్యాల : జగిత్యాల రూరల్ మండలం చర్లపల్లి, బీర్పూర్ మండలం లోని గొండు గూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్, కార్యవర్గాలు ఎకగ్రీవమయ్యాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా రెండు గామాలలో సింగిల్ నామినేషన్లు దాఖలు కావడం తో ఏకగ్రీవంగా ఏన్నికయ్యాయి. గురువారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసేందుకు వచ్చిన కొత్త కార్యవర్గాన్ని ఎమ్మెల్యే శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమం లో చర్ల పల్లి, గోండు గూడెం నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గం సర్పంచ్ లు వనిత ఆనంద్, కల్పన రామచంద్రం, ఉప సర్పంచ్ లు దుమాల సుమన్, పెండ్రం సీతారం, వార్డు సభ్యులు, కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రామచందర్ రావు, మాజీ సర్పంచ్ లు దుమాల తిరుపతి, నరేందర్,
తదితరులు పాల్గొన్నారు.