News & Views

చర్చ, పెద్దపల్లి: ఓటు హక్కు అందరి బాద్యత…స్వేచ్చగా ఓటు వేయండి..- పెద్దపల్లి డిసిపి బి.రాంరెడ్డి

 

ఎన్నికల నియమాళి పై ప్రజలకు అవగాహన సదస్సు..

  • పంచాయతి ఎన్నికలకు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు. – పెద్దపల్లి డిసిపి బి.రాంరెడ్డి వెల్లడి.

చర్చ,పెద్దపల్లి:

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని పెద్దపల్లి డిసిపి బి రాంరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు  ముందస్తు భద్రత చర్యలలో భాగంగా ముత్తారం పోలీస్ ఆధ్వర్యంలో మండలంలోని  ఖమ్మం పల్లి, ఓడేడు, అడవి శ్రీరాంపూర్, కేశనపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి  పై ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  డిసిపి బి.రాంరెడ్డి మాట్లాడుతూ ప్రజలు, అభ్యర్థులు, పార్టీ ప్రతినిధులకు యువత కు  ఎన్నికల నిబంధనలు,ఓటు హక్కు వినియోగం పై అవగాహన కల్పించారు .

శాంతి యుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలందరు ఎలక్షన్ సిబ్బందికి,పోలీసులకు సహకరించాలని సూచించారు.   పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు  ప్రశాంతంగా కొనసాగేందుకు  అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జోన్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయితీల ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు.ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి ఎం రమేష్, మంథని సీఐ బి రాజు, ముత్తారం ఎస్ ఐ రవి కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.