News & Views

చర్చ, జగిత్యాల: ప్రజా భద్రతలో హోమ్ గార్డుల సేవలు విలువైనవి – జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ప్రజా భద్రతలో హోమ్ గార్డుల సేవలు విలువైనవి – జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

చర్చ, జగిత్యాల
ప్రజల భద్రత, విపత్తు ప్రతిస్పందన, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణ వంటి విభాగాల్లో హోమ్ గార్డులు అందిస్తున్న సేవలు అత్యంత అభినందనీయమైనవని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు గురువారం నిర్వహించిన హోమ్ గార్డ్ రైజింగ్ డే వేడుకల సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఎస్పీ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ శాంతిభద్రత లు, ట్రాఫిక్‌, క్రైమ్‌ నివారణ, కమ్యూని టీ పోలీసింగ్‌, విపత్తు నిర్వహణ వంటి విభాగాల్లో అత్యుత్తమ పనితీరును కనబరుస్తు అత్యవసర పరిస్థితుల్లో హోమ్ గార్డులు చూపే అంకితభావం ప్రశంసనీయం అన్నారు. జిల్లా హోమ్ గార్డ్ సిబ్బంది ప్రతి డ్యూటీని బాధ్యతగా నిర్వహించడం వారి క్రమశిక్షణ, సేవాస్ఫూర్తి పోలీస్ శాఖకు గర్వకారణం ఎస్పీ అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్, సైదులు, వేణు, రిజర్వ్ ఎస్. ఐ లు, హోమ్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.