చర్చ, జూలూరుపాడు: కొమ్ముగూడెం పంచాయతీ సీపీఎం సర్పంచ్ అభ్యర్థి గా బానోత్ మోతి
చర్చ, జూలూరుపాడు: కొమ్ముగూడెం పంచాయతీ సీపీఎం సర్పంచ్ అభ్యర్థి గా బానోత్ మోతి
జూలూరుపాడు మండలం, కొమ్ముగూడెం పంచాయతీ ఎన్నికలలో సీపీఎం బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బానోత్ మోతి, వార్డు మెంబర్లుగా బానోత్ రూపా, నునావత్ జయ, భూక్య పార్వతి, లకావత్ అనిత, భానోతు జ్యోతిబాసు, గూగులోత్ కంశాలి, గుగులోత్ మంగీలాల్ గురువారం నాడు నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిరంతరం ప్రజల కోసం పనిచేసే నిస్వార్ధపరులైన సిపిఎం అభ్యర్థులను గెలిపించుకోవాలని, ధనం తదితర ప్రలోభాలకు గురి కావద్దని, నిస్వార్ధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి నిస్వార్ధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి పూనుకుంటారని, సిపియం బలపరచిన అభ్యర్థుల గెలిపించాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, అన్నవరపు కనకయ్య, జిల్లా కమిటీ సభ్యుడు కొండపల్లి శ్రీధర్ నాయకులు భానోత్ ఈశ్వర్, భూక్యా బిచ్చు, భూక్యా మంగ్యా, శంకర్ మోహన్ లాల్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.