News & Views

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: బాల్యస్నేహం అక్షయబంధం – పూర్వ విద్యార్థుల సేవా హస్తం..

బాల్యస్నేహం అక్షయబంధం..2000–2001 బ్యాచ్‌ పూర్వ విద్యార్థుల సేవా హస్తం..

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ
జిల్లా పరిషత్ హై స్కూల్ బొల్లోరిగూడెం 2000–2001 పదవ తరగతి పూర్వ విద్యార్థులు తమ బాల్య స్నేహబంధం విలువను నిలబెట్టుకుంటూ, మానవతా దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. వీరి తోటి మిత్రుడు కొమ్మోజి అకాల మరణం పట్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ.. అతని దశదిన కార్యక్రమం సందర్భంగా మిత్రులందరూ కలిసి 28 వేల రూపాయలను సేకరించి, బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు.ఇతరుల కష్టసుఖాల్లో పూర్వ విద్యార్థుల సంఘంగా అండగా నిలుస్తున్న ఈ బ్యాచ్‌ గతంలో కూడా మిత్రుడు కాల్వ రాజశేఖర్ అకాల మరణం సమయంలో సుమారు 25 వేల రూపాయలను వారి కుటుంబానికి అందజేసింది.అవసర సమయంలో మానవత్వం ప్రదర్శించడం తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని, మిత్రుల‌లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు వెంటనే సహాయంగా నిలవాలని 2000–2001 బ్యాచ్‌ విద్యార్థులు నిర్ణయించుకున్నారు.స్నేహం ఒక మాట మాత్రమే కాదు జీవితకాలం నడిచే బంధం అనే సందేశాన్ని సమాజానికి తెలియజేసే విధంగా ఈ సేవా కార్యక్రమం చోటుచేసుకోవడం విశేషం. చిన్ననాటి స్నేహాన్ని కేవలం జ్ఞాపకాల్లో కాకుండా, ఆచరణలో చూపిస్తూ ముందుకు సాగుతున్న ఈ పూర్వ విద్యార్థుల సేవా భావం ప్రశంసనీయమని సామాజిక వర్గాలు అభినందిస్తున్నాయి.