చర్చ, జగిత్యాల: ఫలించిన మంత్రి అడ్లూరి కృషి – జగిత్యాల టూ శబరికి రెండు రైళ్లు
ఫలించిన మంత్రి అడ్లూరి కృషి
- జగిత్యాల టూ శబరికి రెండు రైళ్లు_
- డిసెంబర్ 24, జనవరి 7న ప్రత్యేక రైళ్లు_
చర్చ, జగిత్యాల : జగిత్యాల నుంచి శబరిమలై కి ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కాంగ్రెస్ సేవాదల్ సెక్రటరీ బోగోజీ ముకేశ్ ఖన్నా ఇటీవలే కోరడం జరిగింది. తక్షణమే స్పందించిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంటనే రైల్వే శాఖ జి. ఎమ్ తో మాట్లాడడం జరిగింది. నవంబర్ 28 న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన కృషి ఫలితమే ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సిద్ధమయ్యారు. డిసెంబర్ 24 న, జనవరి 7 వ తేదీలలో ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమయ్యారు. రెండు రైళ్లు నాందేడ్ నుంచి కొల్లం వరకు ( శబరిమలై ) వెళ్లే అయ్యప్ప స్వాములకు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. అయ్యప్ప స్వాముల ఇబ్బందులను తొలగించేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన కృషితో అయ్యప్ప స్వాములకు, భక్తులకు ఇబ్బందులు తొలిగిపోతాయని, ప్రత్యేక రైలు ఏర్పాటుకు కృషిచేసిన మంత్రికి అయ్యప్ప స్వాములు, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.