News & Views

చర్చ,గోదావరిఖని: ఆసుపత్రులను తనిఖీ చేసిన జిల్లా వైద్యాదికారి ..

ఆసుపత్రులను తనిఖీ చేసిన జిల్లా వైద్యాదికారి ..

చర్చ,గోదావరిఖని: గోదావరిఖని పట్టణంలో రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్న సుగుణ డెంటల్ క్లినిక్, సత్య డెంటల్ క్లినిక్,జెమినీ నర్సింగ్ హోమ్, శ్రీదేవి నర్సింగ్ హోమ్, సురేఖ హాస్పిటల్ లో తనిఖీలు నిర్వహించారు..
స్కానింగ్ సెంటర్లలో డేటా, ఫారం–ఎఫ్, సంబంధిత రికార్డులను పరిశీలించారు.గర్భస్త శిశువు లింగ నిర్ధారణ చేయడం ప్రీ-కన్సెప్షన్ అండ్ ప్రీ-నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ చట్టం–1994 ప్రకారం చట్టవిరుద్ధమన్నారు.
అనంతరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని ఎస్ఎన్ సి యులో నవజాత శిశువుల చికిత్స విధానాన్ని పరిశీలించారు. పిల్లల వైద్యలు,అసిస్టెంట్ ప్రొఫెసర్ డా రాజీవ్ ,నర్సింగ్ ఆఫీసర్ సువర్ణ, ల్యాబ్ ఇన్‌చార్జ్ శివ సిబ్బందితో కలిసి సంకల్ప్ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, నవజాత శిశు మరణాలు తగ్గించడం ,తక్కువ బరువుతో పుట్టిన శిశువులు, నెలలు నిండక ముందే పుట్టిన శిశువులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు ,సిబ్బందికి సూచించారు. కంగారు మదర్ కేర్ విధానంపై తల్లులకు అవగాహన కల్పించాలన్నారు.
అనంతరం అడ్డకుంటపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ప్రతి మంగళవారం మహిళా ఆరోగ్య కేంద్రాన్ని నిర్వహించేందుకు సిబ్బంది కి అవసరమైన ప్రతిపాదనలను పంపనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డా బి శ్రీరాములు, వైద్య అధికారి డా లక్ష్మీ భవానీ,డిప్యూటీ మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.