చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ మండలం నాగారం గ్రామం లో కరపత్రాల కలకలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
పాల్వంచ మండలం నాగారం గ్రామం లో కరపత్రాల కలకలం,
తస్మాత్ జాగ్రత్త ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నీతి నిజాయితీ గా వ్యవహరించక పోతే మీ అంతు చూస్తాం అంటూ, గ్రామం లో ఉన్న సమస్యలు పట్టించుకోవాలి అని, ఓటు డబ్బులు పంచితే పట్టిస్తాం అని రాత్రి కరపత్రాలు గ్రామం లో అక్కడక్కడ ప్రధాన కూడలి లలో దుకాణల ముందు వదిలి వెళ్లారు,
మేము ఎవరో కాదు మీతో నే ఉన్నాము మీలోనే ఉంటాం, మేము ముప్పై మంది యువకులము ఉన్నాము, ఒక్క పార్టీ లో కాదు అన్ని పార్టీ లలో ఉన్నాము అని హెచ్చరిక చేశారు, గ్రామం లో ఇసుక, దందా, గంజాయి, పై దృష్టి పెట్టాలని కూడా హెచ్చరిక చేశారు