చర్చ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్లో కవిత పర్యటన – కుత్బుల్లాపూర్ కాదు… కబ్జాలాపుర్. – కల్వకుంట్ల కవిత
కుత్బుల్లాపూర్లో కవిత పర్యటన – కుత్బుల్లాపూర్ కాదు… కబ్జాలాపుర్..కల్వకుంట్ల కవిత ఫైర్..
- ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న కుత్బుల్లాపూర్ లో 100 పడకల ఆసుపత్రి కూడా నిర్మించాలేరా…
- జగద్గిరిగుట్ట బస్సు డిపో, మెడికల్ కాలేజీ ఏర్పాటు కలేనా…?
- కబ్జాలపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లెవా…?
- పరికి చెరువు కబ్జాపై నోరు విప్పని హైడ్రా రంగనాధ్
- కుత్బుల్లాపూర్ లో జనం బాటలో కల్వకుంట్ల కవిత ఫైర్..
చర్చ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ ను కాస్త కబ్జాలాపూర్ గా పేరు మారిస్తే బాగుటుందేమోనని ఇక్కడి కబ్జాలు చూస్తే అర్థం అవుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జనం బాటలో భాగంగా శుక్రవారం శాపూర్ నగర్ లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి ఆసుపత్రి సిబ్బంది, రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గాజులరామారంలో గల పరికి చెరువును, సూరారం లోని లింగం చెరువును పరిశీలించి చెరువు అక్రమణలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మల్లంపేటలో జాగృతి లోకి నూతనంగా చేరిన వారికి ఆమె కండువా కప్పి జాగృతి లోకి ఆహ్వానించారు. చర్చి గాగిల్లాపూర్ లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను జాగృతి నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ … 60 ఎకరాల్లో విస్తరించి ఉండాల్సిన పరికి చెరువు సగానికి పైగా కబ్జా కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. 62 ఎకరాలు ఉంటే ఇప్పుడు మాత్రం 16 ఎకరాలకు కుదించుకుపోయిందని చుట్టు పక్కల వాళ్లు చెరువు పరిరక్షణ కోసం ఎన్నో కేసులు పెట్టారని తెలిసిందని అగ్రహం వ్యక్తం చేసింది. పొలిటికల్ మేనేజ్ మెంట్ చేస్తూ చెరువు తినేశారని ఈ కబ్జా ల తతంగం లో అన్ని పార్టీల వాళ్లు ఉన్నారన్నారంది.ఇప్పటికీ కూడా ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఇళ్ల పహానీలు చూస్తే ఎఫ్టీఎల్ లో ఉన్నట్లు చూపిస్తున్నాయని,
ఎఫ్టీఎల్ లో ఉన్నప్పటికీ నిర్మాణాలకు ఎలా అనుమతిస్తున్నారని ఇది గతపాలకుల, అధికారుల అలసత్వం అని ఏద్దేవా చేసింది.? ఎఫ్టీఎల్ అని రాసి ఉన్న రాళ్లను కూడా రియల్ ఎస్టేట్ మాఫియా భయం లేకుండా తీసేసిందని,హైడ్రా కమిషనర్ కచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇక్కడి ఎమ్మెల్యే గతంలో టీడీపీ లో ఉండి బీఆర్ఎస్ లోకి వచ్చారు. రేపు ఎక్కడ ఉంటారో తెలియదన్నారు. ఆయన అండదండలతోనే చెరువుల కబ్జాలు జరిగయన్నారు. పేదవాళ్ల ఇళ్లే కాదు, పెద్ద వాళ్ల ఇళ్లను కూడా కూల్చేస్తామని మెసేజ్ ఇవ్వాలన్నారు. గత ఎన్నికల్లో జగద్గిరిగుట్ట బస్సు డిపో ను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చిన ప్రజాప్రతినిధులకు ఇప్పటి వరకు ఏర్పాటు చేసే సోయిలేదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మెడికల్ కాలేజీ మంజూరైన దానిని ఏర్పాటు చేసే దమ్ము కూడా ఇక్కడి నాయకులకు లేదా అని ప్రశ్నించారు. కుత్బుల్లాపూర్ లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ లను ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి పేదలకు అందజేయాలని డిమాండ్ చేసింది. ప్రజల పక్షానే జాగృతి పోరాటం చేస్తుందని… పేదలకు న్యాయం చేయకుండా మోసం చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాగృతి బీసీ రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి మారయ్య, రాష్ట్ర నాయకులు ఇస్మాయిల్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రాగిడి వెంకటరామిరెడ్డి, అధికార ప్రతినిధి పడాల మనోజ్, శీలం వీరేందర్, సీతారాం, సంధ్యారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.