చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఎన్నికల సజావు జరగాలి – డీఎస్పీ. సతీష్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…పాల్వంచ:
ఎన్నికల సజావు జరగాలి.. డీఎస్పీ. సతీష్:
పాల్వాంచ మండలం లో ఈ రోజు కోడిపుంజుల వాగు గ్రామం పంచాయతీ పరిధిలో కోడిపుంజుల వాగు గ్రామంలో పాల్వంచ డిఎస్పి ఆర్ సతీష్ కుమార్ అదే విధంగా పాల్వంచ సిఐ కే సతీష్ ఆధ్వర్యంలో జరగబోవు గ్రామపంచాయతీ ఎలక్షన్లలో అందరూ పాటించవలసిన నియమాల గురించి పద్ధతుల గురించి ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా ఎలక్షన్స్ జరిగే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని తగు సూచనలు చేయడమైనది. ఇట్టి కార్యక్రమంలో గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా పోటీ చేయబోవు అభ్యర్థులు అదేవిధంగా గ్రామ ప్రజలు పాల్గొన్నారు