చర్చ,బెల్లంపల్లి: ఏసిబి వలలో పంచాయతి కార్యదర్శి..
చర్చ,బెల్లంపల్లి: ఏసిబి వలలో పంచాయతి కార్యదర్శి..
కన్నెపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న గొల్లపల్లి రాజ్ కుమార్ ఇందిరమ్మ ఇంటి బిల్లు ఇప్పించడం కోసం లబ్ధిదారుడి నుంచి రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇచ్చుకోలేమని బాధితుడు రూ.5 వేలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు.ఏసిబి అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో బాధితుని వద్ద నుంచి రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు చిక్కాడు. అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఎలాంటి భయం లేకుండా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని డిఎస్పి మధు పేర్కొన్నారు.