చర్చ, సత్తుపల్లి: మంత్రి ఊరులో సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవం..

చర్చ, సత్తుపల్లి: మంత్రి ఊరులో సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవం..
కల్లూరు మండలం, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి లు గ్రామం నారాయణపురం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కాగా, బీజేపీ అభ్యర్ధి ఉపసర్పంచ్ ఏకగ్రీవం అయింది.
సర్పంచ్ గొల్లమందల వెంకటేశ్వర్లు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న స్థానిక నాయకులు.
ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కస్టపడి పనిచేసి అందరికీ అందుబాటులో ఉండాలని సూచించారు. ఇప్పటికే గ్రామంలో క్వాలిఫై డాక్టర్ తో హాస్పిటల్, పవర్ సబ్ స్టేషన్ ల నిర్మాణాలకు కోట్ల రూపాయి నిధులు కేటాయించినట్లు తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులతో గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానన్న సర్పంచ్ గొల్లమందల వెంకటేశ్వర్లు.