News & Views

చర్చ, పినపాక: ఎస్ఎ.స్.టి చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు పరిశీలించిన తహసిల్దార్, ఎంపీవో

ఎస్ఎ.స్.టి చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు పరిశీలించిన తహసిల్దార్, ఎంపీవో

ఆధారాలు లేకుండా నగదు తరలిస్తే ఆ నగదును సీజ్ చేయాలని తాసిల్దార్ గోపాలకృష్ణ ఎస్ఎస్టి అధికారులకు సూచించారు. ఎంపీఓ వెంకటేశ్వరరావు ఎస్ఎస్టి ఇంచార్జి ప్రదీప్ రెడ్డి తో కలిసి శనివారం వాహన తనిఖీలను పరిశీలించారు. అనంతరం చెక్పోస్ట్ వద్ద రిజిస్టర్లను పరిశీలన చేశారు. తగిన ఆధారాలు లేని నగదు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీజ్ చేయబడుతుందని తగిన ఆధారాలు చూపిస్తే ఆ నగదును తిరిగి అందజేస్తామని తెలిపారు. 24 గంటలు ఎస్ఎస్టి చెక్పోస్ట్ వద్ద తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ లు అశోక్, ఉపేందర్, పోలీస్ సిబ్బంది సురేష్, ప్రభాకర్, మనోజ్, తదితరులు పాల్గొన్నారు.