చర్చ, జగిత్యాల: రోళ్ళవాగు ప్రాజెక్ట్ కి అనుమతులు వేగవంతం చేయండి – మంత్రి భూపేందర్ యాదవ్ ను కోరిన ఎంపీ అర్వింద్
రోళ్ళవాగు ప్రాజెక్ట్ కి అనుమతులు వేగవంతం చేయండి
- నగర్ వన్ యోజన కింద పెండింగ్ నిధులు విడుదల చేయండి
- మంత్రి భూపేందర్ యాదవ్ ను కోరిన ఎంపీ అర్వింద్
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో గల రోళ్ళవాగు ప్రాజెక్ట్ అనుమతుల పనులను వేగవంతం చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి కోరారు. ఇటీవల జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ రోళ్ల వాగు ఆవశ్య కతను, అనుమతుల విషయంలో చొరవ తీసుకోవాలని ఎంపీ అర్వింద్ ని కోరారు. ఇదే అంశంపై ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో వెళ్లిన ఎంపీ అర్వింద్ కలిసి విన్నవించారు. అంతేకాకుండా జగిత్యాల అర్బన్ మండలంలో అర్బన్ ఫారెస్ట్ ల అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం నగర్ వన్ యోజన పథకం కింద రెండు కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇందులో ఇదివరకే 1.4 కోట్ల రూపాయలు విడుదల కాగా, 60 లక్షల రూపాయలు విడుదల కావలసి ఉందని, వాటిని తక్షణమే విడుదల చేయాలని కోరారు. సమస్యలను సావధానంగా విన్న మంత్రి, త్వరతగతిన పరిష్కరించి నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ఎంపీ అర్వింద్ కృతజ్ఞతలు తెలిపారు.