చర్చ, జగిత్యాల : ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ ను సన్మానించిన ఎమ్మెల్యే సంజయ్
ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ ను సన్మానించిన ఎమ్మెల్యే సంజయ్
చర్చ, జగిత్యాల : జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట గ్రామ సర్పంచ్ గా గోడిసెల గంగాధర్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలవగా గంగాధర్ ను శాలువాతో ఎమ్మెల్యే సత్కరించి అభినందించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్నేహ భావం, సోదర భావన తో ఏకగ్రీవ గ్రామ పంచాయతీ పంచాయతీల సమగ్ర అభివ్రుద్ది కోసం సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవాలు అవుతున్నాయని అన్నారు.
గొడవలు కొట్లాటలతో పల్లెల్లో స్నేహ పూర్వక, అభివ్రుద్ది వాతావరణం ఉండదని సూచించారు. ప్రభుత్వంతో కలిసి పనిచేసే ప్రజా సేవకులకు నేడు ఏకగ్రీవాలు కావడం ఆనందదాయకమన్నారు.
జగిత్యాల నియోజకవర్గం లో గతంలో నాతో కలిసి పనిచేసిన 8 గ్రామ పంచాయతీ లు ఏకగ్రీవం అయ్యాయన్నారు. గ్రామాల అభివ్రుద్ది కి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ నారాయణ, నాగరాజు, వెంకటేశ్వర ఆలయ ఛైర్మెన్ తక్కురీ మల్లేశం, చెట్పల్లి సుధాకర్ , ప్రభాత్ సింగ్ ఠాగూర్,కత్రోజ్ గిరి,రామకృష్ణ రెడ్డి, ఏనుగుల రాజు తదితరులున్నారు.