చర్చ, జగిత్యాల: నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే
ప్రజల్లో రేషన్ కార్డు కలిగిన నిరుపేద ప్రజలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఉచిత కంటి ఆపరేషన్లు చేశారు. జగిత్యాల పావని కంటి ఆసుపత్రి, ఆపి, రోటరీ క్లబ్ సంయుక్తంగా జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 21 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అనంతరం ఉచిత కళ్ళ అద్దాలు, మందులు పంపిణీ చేశారు. ఓవైపు ప్రజా సమస్యల పరిష్కారాలలో, నియోజకవర్గ అభివృద్ధి పై నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనలోని నేత్ర వైద్యుడి సేవలను అందించాలనే తపన తో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహిస్తుంటాడని సన్నిహితులు అంటున్నారు.
ఈ కార్యక్రమంలో
డా.విజయ్, చెట్ పెల్లి సుధాకర్, జంబర్తి శంకర్, రాజేశ్వర్ రెడ్డి,
ములాసపు మహేష్, కొలగాని సత్యం ,సురేష్, శరత్ రావు, ప్రభాత్ సింగ్ ఠాగూర్, ఏనుగుల రాజు, వంశీ బాబు, ఆసుపత్రి సిబ్బంది, నాయకులు తదితరులున్నారు.